Featured Post

India Banned 47 China Apps | PubG App Ban List |second digital strike on China

         భారతదేశంలో మరో  47 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.గతంలో జూన్ చివరలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్ యాప్  తో సహా 59 Chinese యాప్స్ ను  "national security కాపాడటానికి" ప్రభుత్వం నిషేధించింది అనే విషయం మన అందరికి తెలుసు. ఇంతకుముందు బ్యాన్చేసిన  యాప్స్ place లో వాటి క్లోన్ యాప్స్ గా పనిచేయడానికి మరో 50యాప్స్ ను చైనా కంపెనీస్ విడుదల చేసాయి. అందులో ఇప్పుడు దాదాపు  47 యాప్స్ నిషేధించబడ్డాయి .

Watch Full Video Here: 

             

    - తాజా నిర్ణయంలో బ్యాన్  చేసిన యాప్స్  జాబితా ప్రభుత్వం  ఇంకా ప్రకటించలేదు. అయితే, త్వరలో ఈ ప్రకటన అధికారికంగా జరుగుతుందని తెలిసింది. PUB G మొబైల్‌తో సహా కొన్ని Top Chinese gaming యాప్స్ ఈ లిస్టు ఉన్నట్లు చెబుతున్నారు. గత 3 సంవస్చారాలుగా పబ్జి గేమ్ గేమింగ్ ప్లాట్ ఫార్మ్ లో ఒక సరికొత్త పంధా ను తీసుకువచ్చింది. ప్రపంచ చరిత్రలో ఈ గేమ్ కు ఉన్న ఆధారాన వేరే దేనికి లేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతగా ఆడ మగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా  ప్రతీ ఒక్కరిని ఈ పబ్ జి  మొబైల్ గేమ్ తన వైపు లాగేసుకుంది. Tencent గేమింగ్ పబ్లిష్ చేస్తున్న ఈ గేమ్ ను కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేయబోయే తన లిస్టు లో  add చేసినట్లు చెబుతున్నారు.


        User privacy లేదా national security violations ను దృష్టిలో పెట్టుకుని మరో 250 కి పైన  యాప్స్ ను బ్యాన్ చేయడానికి భారత ప్రభుత్వం రెడీ అవుతుంది.TikTok, కామ్‌స్కానర్, షేర్‌ఇట్ మరియు యుసి బ్రౌజర్‌తో సహా  మరికొన్ని యాప్‌లను ప్రభుత్వం ఇంతకుముందు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69 A నిబంధనల ప్రకారం ఆ నిషేధాన్ని ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిషేధించబడిన 47 యాప్స్ గత నెలలో నిషేధించబడిన 59 యాప్‌ల క్లోన్‌లుగా పనిచేస్తున్నాయని డిడి న్యూస్ తన ట్వీట్‌లో పేర్కొంది. ప్రతీ యూజర్ గోప్యత లేదా జాతీయ భద్రతా ఉల్లంఘనల కోసం పరిశీలించబడే 250 కి పైగా యాప్‌ల జాబితాను కూడా ప్రభుత్వం సిద్ధం చేసిందని Citing government sources ద్వారా తెలిసిందని ఇండియా టుడే టివి ఇచ్చిన నివేదిక తెలిపింది.


       పబ్‌జీ మొబైల్‌, లూడో వల్డ్, ఇ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ అలీ ఎక్స్‌ప్రెస్‌, జిలీ, బైట్‌ డ్యాన్స్‌కు చెందిన మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్‌ రెస్సో, Ulike లాంటివి ఉండొచ్చని సమాచారం. మీటు, ఎల్‌బిఇ టెక్, పర్ఫెక్ట్ కార్ప్, సినా కార్ప్, Netease గేమ్స్, యూజూ గ్లోబల్ వంటి ఇతర యాప్‌లు కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. ఈ యాప్స్ అన్ని చైనా ఏజెన్సీలతో డేటాను పంచుకున్నాయని గతంలో తెలిపారు. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ (మీటీవై) నిషేధించబడిన 59 చైనా యాప్స్ ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని హెచ్చరిక జారీ చేసింది. దీంతో డ్రాగన్ కంట్రీపై డిజిటల్ స్ట్రైక్‌ని ప్రకటించిన భారత్‌, ఆ దేశ ఆదాయానికి గండి కొట్టింది. ఇక భారత్‌ను ఫాలో అవుతూ చైనా యాప్‌లను నిషేధించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. మన దేసాని ఫాలో అవుతూ మరికొన్ని దేశాలు కూడా చైనా అప్ప్స్ ను బ్యాన్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాయి.
 india banned china apps, India banned apps alternates, china apps banned in india, 47 new apps banned, 250 new apps banned, 



India Banned 47 China Apps | PubG App Ban List |second digital strike on China India Banned 47 China Apps | PubG App Ban List |second digital strike on China Reviewed by M. Prabhakara Reddy on July 27, 2020 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Interlink Network Free Mining: Step‑by‑Step Guide to Earn ITLG Tokens (No Investment Needed)

Interlink Network Free Mining: Step-by-Step Guide to Earn ITLG Tokens Interlink Network Free Mining: Step-by-Step ...

Ads Home

Travel everywhere!