Featured Post

Free Barrister Parvateesam Book | Read Barrister Parvateesam Book Online Free

              ముందు గా ఒక ఫేమస్ మూవీ డైలాగ్ తో మొదలు పెడదాం. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్క రోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవలనుకున్టున్నారు. తెలుగంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవడం కాదురా! అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి. అయిన దెబ్బ తగిలితే షిట్ అని అసుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్ప తనం ఏమర్ధమవుతుంది. తెలుగు గురించి ఒక తెలుగు సినిమా లో చెప్పిన ఒక అద్బుతమయిన డైలాగ్ ఇది. ఇప్పటి రోజుల్లో ఇంగ్లీష్ బాష మనకు చాల అవసరం. కాని తెలుగు మన సంస్కృతి, సాంప్రదాయం మన నడవడిక అన్నింటి తోను ముడిపడి ఉంటుంది. పెళ్ళయితే భార్య వచ్చింది కదా అని తల్లిని వదలము కదా. మరి తల్లి లాంటి బాషను ఎలా వదిలేస్తాం. ఇంగ్లీష్ కచ్చితంగా చదవండి, కాని తెలుగును మర్చిపోకండి.

బారిష్టర్ పార్వతీశం:
        రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి గారి కలం నుండి ప్రాణం పోసుకున్న హాస్యంతో కూడిన నవల ఈ బారిష్టరు పార్వతీశం. ఈ కథ మొత్తం ఒక్కరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అతగాడే పార్వతీశం. నేను చదువుకునే రోజుల్లో మా తెలుగు ఉపవాచకం పుస్తకం ఇదే. ఆ రోజుల్లో ఈ కథకు ఉన్న విలువ అంతా ఇంతా అని నేను లేక్కకట్టి చెప్పలేను. అది మామూలు కథ అని కూడా అనుకోలేము. ఎందుకంటే అది నిజంగా ఒక మామూలు కథ అయ్యి ఉంటె ఒక పాఠ్య పుస్తకంగా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తుంది.అసలు ఈ కథకు రూపకల్పన ఎలా జరిగిందో ఒక్కసారి తెలుసుకుందా. రచయిత నరసింహ శాస్త్రి అత్తగారి ఊరు నర్సాపురం దగ్గర గుమ్మలూరు అనే గ్రామం. అక్కడకు వెళ్ళిన ప్రతీసారి వారి బంధువులందరూ ఈయన తో సరదాగా కాలక్షేపం కోసం ఏవో కొన్ని కథలు చెప్పించుకునేవారు. నరసింహశాస్త్రి గారి నోటినుంచే వచ్చే పదాలు కూడా అంతగా అందరిని ఆనందింపజేసేవి. అల ఒకసారి అక్కడికి వెళ్ళినపుడు తన బంధువుల కోసం ఒక పడవ ప్రయాణంలో ఉండే కష్టాలు, తమాషాలు సరదాగా చెప్పారు. వాళ్ళు ఆనందించి దాన్ని ఓ కథలా రాయమన్నారు. అప్పటికే ఈయన ఏకోదరులు, ప్రతిబింబములు, మొక్కుబడి, కన్నవి - విన్నవి అనే పలు రచనలు చేసారు. అప్పటికే ఆయన రాసిన మూడు కథలు సాహితి, మరియు భారతి పత్రికలలో ముద్రించాబడ్డాయి.
            


తన బంధువులతో పంచుకున్న ఈ కథను తన బందువులు చెప్పేవరకు దీన్ని ఓ రచనగా మలచాలనే సంకల్పం లేదు. ఈయన అంత దూరం ఆలోచించను లేదు. కానీ శ్రోతలు ఇచ్చిన ఉత్సాహంతో ముందుగా ఒక కుర్రవాడిని నర్సాపురం నుంచి నిడదవోలు, అక్కడ నుంచి మద్రాసు చేరినట్లు రాసి కుర్రవాళ్ళకు చదివి వినిపించారు. వారు బాగుందనడంతో ఉత్సాహంతో కథానాయకుడు అక్కడి నుంచి బారిష్టరు చదువుకోసం ఇంగ్లాండ్ ప్రయాణించడం వరకు రాయాలనుకున్నారు. ఆ రోజుల్లో ఇంగ్లండు వెళ్ళి బారిష్టరు చదవడమంటే గొప్ప. అప్పటి దాకా పేరు పెట్టని పాత్రకు పార్వతీశం అని పేరు పెట్టి చదువు ఇతర వివరాలన్నీ రాశారు. తర్వాత అంతా పార్వతీశం తన కథను అంచలంచెలుగా చెప్పుకుపోతుంటాడు. ఈ కథను మొత్తం మూడు (3) బాగాలుగా రచించారు.
బారిష్టర్ పార్వతీశం Free Barrister Parvateesam Book | Read Barrister Parvateesam Book Online Free

బారిష్టర్ పార్వతీశం మొదటి భాగం:

       పార్వతీశం ఉన్నత చదువుల కోసం తాను పుట్టి పెరిగిన ఊరిని కన్నవారిని, ఎంతో ప్రేమగా చూసుకునే తన స్నేహితులను విడచిపెట్టి మొగల్తూరు నుండి బయలు దేరి నిడదవోలు మీదుగా చెన్నై వెళ్తాడు. అక్కడ నుండి ఓడ పట్టుకొని ఇంగ్లాడు చేరుతాడు. ఈ భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా నిడదవోలు నుండి మద్రాసు వెళ్ళే రైలు ప్రయాణం చాలా హాస్యరసంగా రచించడం జరిగింది. మద్రాసు నుండి ఇంగ్లాండు వెళ్ళడానికి కావలసిన సరంజామా కొనుక్కొనే సన్నివేశాలు చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. ఈ నవలను తెలుగు అకాడమీ పుస్తకాల్లో పదవ తరగతి తెలుగు ఉపవాచకముగా అందించారు.



బారిష్టర్ పార్వతీశం రెండవ భాగం:

    ఓడలో ఇంగ్లండ్ చేరు కొన్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్‌లాండ్లో ఎడిన్బర్గ్ నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టుగా చేరుతాడు. అక్కడే ఒక లా కళాశాలలో చేరుతాడు. ఇంగ్లీష్ ఏమాత్రం రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. మొదటి భాగం తో పోల్చుకుంటే హాస్యం పాళ్ళు ఈ భాగంలో తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకంలో బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పడతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా వ్రాశారు.

బారిష్టర్ పార్వతీశం మూడవ భాగం:

          మూడవ భాగం ముఖ్యంగా ఇంటికి వచ్చాక పార్వతీశం ను ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు, అక్కడ తారసపడే అనేక విషయాలు, ఈ కాలం వారికి కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన. దేశ భక్తి ప్రజా సేవ గురించి ఈ భాగం లో బాగా చూపించారు.


మీరు కూడా ఈ బుక్ చదవాలి అనుకుంటే వీడియో క్రింద description లో వెబ్ సైట్ లింక్ ఉంటుంది అక్కడ కూడా ఒక లుక్ వేసేయండి. ఈ బుక్ చదవడానికి మీరు ఒక్క పైసా కూడా పే చేయాల్సిన అవసరంలేదు. free గా చదువుకోవచ్చు. వీడియో అయిపోయిందనుకుని వెళ్ళిపోకండి, ఇంకా ఉంది.

బారిష్టర్ పార్వతీశం పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
   
Free Barrister Parvateesam Book | Read Barrister Parvateesam Book Online Free free books for kids, free online books, most read books, Novel books, great books,

          ఈ విషయాలు అన్ని ఇప్పుడు చెప్పుకోవడానికి చాలా సులభం అనిపించినా ఈ పుస్తకాన్ని ప్రచురించిన తరువాత 'బారిష్టర్ పార్వతీశం' గ్రంథాన్ని అమ్మడానికి రచయిత పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు. మరో ప్రముఖ రచయిత అయిన పోలాప్రగడ సత్యనారాయణ మూర్థి గారి మాటలలో..


         "ఒక రోజు కళాశాల నుంచి ఇంటి కొచ్చే సమయానికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు బారిస్టర్ పార్వతీశం నవలా రచయిత మొక్క పాటి నరసింహ శాస్త్రి గారు. కుశల ప్రశ్నలు అయినతర్వాత ఆయన వచ్చిన పని గురించి వివరించారు.

"వాడెవడో చెబితే నమ్మి ఐదు వేల కాపీలు బారిస్టర్ పార్వతీశం పుస్తకం ముద్రించాను. పది హేనేళ్లయింది. ఇంకా పదిహేను వందల పుస్తకాలు మిగిలి వున్నాయి. ఈ వూళ్లొ నాలుగైదు హైస్కూళ్లున్నాయంట గదా.... ఒక్కొక్క ఉన్నత పాఠశాల ఇరవై అయిదు చొప్పున కొన్నా, అంతా కొంటే వంద పుస్తకాలు అవుతాయి. ఒక్కో కాపి రూపాయా పావలా... రేప్పొద్దున వెళ్లి ఒక్కొక్క హెడ్మాస్టర్ ను కలుసు కోవాలి. పని ఎంత వరకు అవుతుందో? ".


పోలాప్రగడ సత్యనారాయణ మూర్థి గారి చాల బాధ కలిగింది. బారిస్టర్ పార్వతీశం అంటే ఒక హాస్య మహా కావ్యం. దాన్ని అమ్ముకోడానికి రచయిత ప్రతి ఉన్నత పాఠశాలకూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా?
"ఎన్ని పుస్తకాలు తెచ్చారు" అని అడిగారు రచయిత సత్యనారాయణ మూర్థి  గారు.
"వంద. అంటే నూట పాతిక రూపాయిలవి"
"మీరెక్కడికి వెళ్లకండి. అవి అమ్ముడయ్యే మార్గం సంగతి నేను చూస్తాను" అని ఆయన అన్నారు. ఆ మర్నాడు ఉదయం ఒక తెల్ల కాగితం మీది ఒక ఆహ్వాన పత్రికను ఈ విధంగా రాశారు. "మొక్క పాటి వారు వచ్చారు. వారి బారిస్టర్ పార్వతీశం నవల వారి సంతకం తో ఇస్తారు. పుస్తకం వెల ఎంత వున్నా పుస్తకం తీసుకున్నవారు మాత్రం వారికి పది రూపాయలివ్వాలి. జేబులో పదేసి రూపాయిలేసుకొని రేపు సాయింత్రం ఆరు గంటలకి స్థానిక లైబ్రరి డాబామీద జరిగే భావపురి రచయితల సమావేశానికి రావలసిందిగా కోరుచున్నా" అంటూ ఒక విద్యార్థికి ఆ కాగితం ఇచ్చి వూళ్లో వున్న లెక్చరర్లు, ప్లీడర్లు, ఉద్యోగులు, విద్యావంతులు ఇతర పుర ప్రముఖులకు చూపించి, వారు చూసి నట్లు సంతకాలు చేయించుకొని రమ్మని పంపించారు.



కాగితం మీద సంతకాలయితే అరవై మంది చేశారు. కాని సభకు వచ్చి మొక్క పాటి వారి సంతకంతో వున్న నవలని పదిరూపాయిలిచ్చి తీసుకోడానికి, ఆయన ఉపన్యాసం వినడానికి నూట పది మంది వచ్చారు. పుస్తకాలు వందే వుండడం వల్ల పది మందికి ఇవ్వలేక పోయాము. కాని రచయితకి గంటలో వెయ్యి రూపాలొచ్చాయి. అదీ ఎలా? భక్తి ప్రవుత్తులతో సంర్పించినవి. మొక్క పాటి వారు ఎంత సంతోషించారో..! నా చేతులు పట్టుకొని " నూట పాతిక వస్తే చాలనుకున్నాను. కాని వెయ్యి రూపాయిలొచ్చాయి.! ఇదంతా నీ వల్లనే" అన్నారు. క్షమించండి ఇది నావల్ల గాదు, బాపట్లలో వున్న రసజ్ఞుల వల్ల. ఒక మంచి గ్రంథాన్ని రచయిత చేతుల మీదుగా తీసుకోవాలనే అకాంక్ష వుండడం వల్లె ఇది సాధ్యమయింది. ఇది వీరందరి రసజ్ఞత.. సంస్కారమూను.." అన్నారు. అదే ఈ రోజుల్లో అయితే ఇది సాద్యమేనా...?

        ఇంత గొప్ప పుస్తకాన్ని పదవ తరగతి తెలుగు ఉపవాచకము నుంచి తొలిగించారు. అవునులే అయినా అలాంటి పుస్తకాలు ఇప్పటిరోజుల్లో రాసే వారు ఎవరన్న ఉన్నారు అంటే వారిని మన చేతివేళ్ళతో లేక్కిన్చేయొచ్చు. అసలు ఇప్పటి చదువుల్లో తెలుగే సరిగ్గా కనపడటంలేదు. ఇంకా కొత్త కొత్త రచయితలు ఎక్కడనుంచి పుడతారు, ఎలా వస్తారు. ఇప్పటి తల్లి తండ్రులను చూస్తుంటే వారి పిల్లల మీద జాలి వేస్తుంది. పిల్లలను చూస్తే కలగాల్సింది జాలి కాదు! వారు చేసే చిన్ని చిన్ని అల్లర్లు, వారి అమాయకపు ఆటలు చూసి ఆనందం కలగాలి. నాకొకటి తెలియక అడుగుతున్నా, సరదాగా చదువుతూ ఆడుకునే ఏజ్ లోనే ఐఐటి (IIT) క్లాస్ లా? పైగా ఏ స్కూల్స్ లో ఈ కోచింగ్ లు లాంటివి ఎక్కువ ఉంట్టాయో వాటిలో లక్షలు పోసి పిల్లల్ని రోబో ల కంటే దారుణంగా తయారు చేస్తున్నారు. డబ్బుల కోసం స్కూల్స్ లో వాళ్ళు ఏమయినా చెబుతారు. తల్లి తండ్రులుగా మీకు అవేమి అక్కర్లేదు కదా! 10 సంవస్చారాల వయస్సులో వాళ్ళ కంటే బరువయిన పుస్తకాలతో నిండిన బాగ్స్ ను మోయలేని భారంగా వారి బుజాలు మోస్తున్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టం మారాలి అంటే ముందుగా మారాల్సింది తల్లి తండ్రులు. పిల్లలకు ఎం కావాలో వాళ్ళకంటే ముందే తెలుసుకుని కష్టపడి కొని తెచ్చి ఇస్తారు. కాని వాళ్ళు ఎలా ఉండాలో ఎం చదవాలో కూడా మీరే డిసైడ్ చేసి అవి పిల్లల మీద రుద్దుతారు. అయిన తప్పు మీది మాత్రమే కాదులే! సోసైటి మన అందరిని అలా తాయారు చేసింది. నేను చెప్పే ఈ విషయాలు మీలో కొంతమందికి నచ్చకపోయి ఉన్దోచు! మనకు నచ్చిన నచ్చకున్న నిజం ఎప్పటికి నిజమే కదా! 


          మన సోసైటి ఎలా తయారయ్యింది అంటే. ఫలానా వారి కొడుకు ఇంజనీర్ చేసాడు, అమెరికా లో జాబు చేస్తున్నాడు, లేదా మరో ఫలానా వారి అమ్మాయి MBBS చేసింది కాబట్టి నా మీ పిల్లలు కూడా అవే చదవాలి అని వాళ్ళకు ఇష్టం లేకపోయినా వాటిలో జాయిన్ చేస్తారు. మీకు చెప్పలేక వాళ్ళు అనుకున్నది చేయలేక నరకయాతన అనుబవిస్తారు. మరికొందరయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కూడా వేరే టాపిక్ అనుకోండి. నిజంగా ఈ ఎడ్యుకేషన్ సిష్టం మారాలి అని మీరు కోరుకున్నట్లు అయితే  ఈ ఎడ్యుకేషన్ సిష్టం టాపిక్ మీద మన ఛానల్ లో వీడియో కావాలి అంటే కింద కామెంట్ లో సింపుల్ గా ఎస్ అని కామెంట్ చేయండి. బారిష్టర్ పార్వతీశం బుక్ కు సంబంధించిన లింక్ క్రింద description లో ఉంటుంది మిస్ కాకుండా ఒక లుక్ వేసేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ని మీరు ఇంకా subscribe చేయకపోతే తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసుకుని  పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీడ క్లిక్ చేయండి. అండ్ ఆలాగే ఈ వీడియో ను మీ స్కూల్ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 




Free Barrister Parvateesam Book | Read Barrister Parvateesam Book Online Free Free Barrister Parvateesam Book | Read Barrister Parvateesam Book Online Free Reviewed by M. Prabhakara Reddy on August 19, 2020 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Interlink Network Free Mining: Step‑by‑Step Guide to Earn ITLG Tokens (No Investment Needed)

Interlink Network Free Mining: Step-by-Step Guide to Earn ITLG Tokens Interlink Network Free Mining: Step-by-Step ...

Ads Home

Travel everywhere!