Featured Post

What Is GPS & How It Works | How India Built NavIC | The Country's Own GPS Network In Telugu


           మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అయితే మీరు కచ్చితంగా గూగుల్  maps ను ఉస్ చేసే ఉంట్టారు.. ఫోన్స్ లో మాత్రమే కాదు కార్స్, బైక్స్ స్మార్ట్ వాచెస్ ఇలా  రెగ్యులర్ గా మనం ఎడిక్ట్ అయిన అన్ని electronic devices లోను GPS ను ఉస్ చేస్తూ ఉంట్టాం. నమ్మకం లేదా కార్ దగ్గరనుంచి మనం తినే తిండి వరకు అన్ని మన ఇంటి ముందుకు  రావాలి అంటే ఈ GPS కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అదేనండి OLA, ఉబెర్ దగ్గర మొదలు పెడితే  Swiggy ,Zomatto వంటి ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ వరకు అనింటికి కావలసింది ఈ మాప్సే కదా.

            

       అసలు GPS ను ఎవరు కనుకున్నారు ఎందుకు కనుక్కున్నారు, GPS అనేది ఎలా పనిచేస్తుంది. ఇండియా తన సొంత satellites ను ఆర్బిట్ లో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి, ఇండియన్ నావిగేషనల్ సిస్టం కు 1999లో  పాకిస్తాన్ పై జరిగిన  కార్గిల్ యుద్ధానికి  సంబంధం ఏంటి ? ఇలాంటి   మరిన్ని ఇంటరెస్టింగ్  విషయాలను ఈ వీడియొ లో తెలుసుకుందాం.

      GPS ఫుల్ ఫార్మ్   Global Positioning System, దీనిని అమెరికన్  మిలటరీ సర్వీసెస్ వాళ్ళు  ఆబ్జెక్ట్ యొక్క Exact Geo-location and Time information తెలుసుకోవడానికి 1973 లో ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసారు.  సైంటిస్ట్ ల 5 సంవస్చారాల కృషికి  ఫలితంగా February 22, 1978 న Navstar 1 అనే satellite ను ఆర్బిట్ లోకి  success ఫుల్ గా పంపించారు. ఈ satellite మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ మనకు కావలసిన particular ఆబ్జెక్ట్ ఈ భూమి మీద ఎక్కడ ఉంది మరియు ఆ ఆబ్జెక్ట్ యొక్క మూవింగ్ టైం ఎంత అని తెలుసుకోవడానికి ఉపయోగ పడే విధంగా డిజైన్ చేసారు. కాని 1978 నుంచి 1980 వరకు US మిలటరీ  forces మాత్రమే ఈ GPS ను యూస్ చేసుకునేది.


    1980 నుంచి ప్రజలందరూ కూడా ఈ టెక్నాలజీ ని యూస్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. కాని అప్పటికి అది US ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండేది. దానికి కారణం వరల్డ్ అంతా కూడా  ఈ GPS అందుబాటులో ఉండాలి అంటే దానికి 24  satellites కావలి  దానికోసం  February  14 1989 లో BLOCK 2 అనే ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసి March 10  1994 సక్సెస్ ఫుల్ గా 24  satellites ను  స్పేస్ లోకి పంపించి సరికొత్త  అభివృధికి నాంది పలికారు.  2018 అక్టోబర్ నాటికి ఆర్బిట్ లో  31  GPS వర్కింగ్ satellites ఉన్నాయి.  ఇప్పటివరకు 72 ఉపగ్రహాలు కక్షలోకి పంపించగా 33 మాత్రమే అక్కడ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ఉన్నవాన్ని కూడా కక్షలో ఉన్న ఉపగ్రహాలు పాడయిన లేదా వాటి లైఫ్ స్పాన్  అయిపోయిన వీటిని వాటి ప్లేస్ లోకి పంపిస్తారు.  ఈ ఒకొక్క satellite వచ్చి దాదాపు 8 నుంచి 10 సంవస్చారాలు పనిచేస్తాయి. 

    GPS ఉపగ్రహాలు భూమికి 20,000 km ఎత్తులో తిరిగుతూ  ఒక కక్షను పూర్తి చేయడనికి 12 గంటలు పడుతుంది. కాని ఉపగ్రహము కదులుతున్నప్పుడు భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల  ఉపగ్రహము ప్రతిరోజూ ఒకే  భూమధ్యరేఖ  అంటే equator ను  రెండు సార్లు  టచ్  చేస్తుంది. ఈ satellites అన్ని  సెకెన్ to సెకెన్  పర్ఫెక్ట్  గా  వర్క్ చేయాలి అంటే  వీటిలో atomic clocks చాలా ఇంపార్టెంట్. ఈ atomic clocks అనేవి ఎలక్ట్రో మాగ్నటిక్ spectrum లో  electron transition frequency ని బేస్ చెసుకుని  nano సెకండ్స్ ను కూడా calculate చేయగలిగే సామర్ధ్యం వీటికి ఉన్ట్టాయి.  ఒక సెకండ్ అంటే 100కోట్ల  నానో సెకండ్స్ తో సమానం. మనం ఒకసారి కళ్ళు మూసి తేరిచేటప్పటికి ఒక సెకండ్ కంప్లీట్ అయిపోతుంది కాని అలంటి నానో సెకండ్స్ ను కూడా accurate గా calculate చేయగల సామర్ధ్యం ఈ atomic clocks కు ఉన్నాయి.  ఈ విధంగా ఈ atomic clock continueగా  సిగ్నల్స్ ను పంపిస్తూ ఉంటుంది. మన devices లో GPS receiver ఆన్ చేసి మన Geo లొకేషన్ తేసులుకోవాలి అంటే GPS ఆన్ అవ్వగానే different directions లో ఉన్న 3 satellites తో geostationary orbit లో  కనెక్ట్ అవుతాయి.


      ఉదాహరణకు మనం సెర్చ్ చేయాలనుకున్న Geo లొకేషన్  మొబైల్ లోని నావిగేషన్ చిప్ satellite 1 నుండి వచ్చే సిగ్నల్స్ ను రిసివ్ చేసుకుని లొకేషన్ ను ఒక సర్కిల్ లో 20 మీటర్స్ లోపు చూపిస్తుంది. దాని తరువత మొబైల్ లోని  GPS చిప్ satellite 2 నుంచి వచ్చే సిగ్నల్ ను రిసివ్ చేసుకుని అది కూడా ఒక సర్కిల్ లో 20 మీటర్స్  radius లో మన లొకేషన్ చూపిస్తుంది. అలాగే satellite 3 నుంచి వచ్చే సిగ్నల్స్ ను కూడా రిసివ్ చేసుకుని exact లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది.   ఈ మూడు సర్కిల్స్ ఎక్కడయితే  కలుస్తాయో దానిని  intersect  లేదా  triangulation ప్రాసెస్  అన్ట్టారు.   ఇలా ఒక particular ప్లేస్ లో కాకుండా మూవింగ్ objects యొక్క స్టేటస్ తెలుసుకోవాలి అంటే రియల్ టైం position తో  అక్కడడ్కు దగ్గరలో ఉన్న satellites తో కనెక్ట్ అవ్వి  మనం ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాం, లేదా కదిలే సమయాన్ని బట్టి చేరుకోవలసిన ప్లేస్ కు ఎంత సేపట్లో చేరుకోగలం అనే ఇన్ఫర్మేషన్ ని రియల్ టైం ఫాక్టర్ సహాయంతో తెలుసుకోవచ్చు .

ఇదంతా ఓకే గాని అసలు ఇండియా ఈ satellites రేస్ లోకి ఎందుకు  వచ్చింది. ? 

      మే 3 1999 న  పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో అంటే టెర్రరిస్ట్   లాగ మారువేషంలో  భారత సరిహద్దులు దాటి లోపలకు వచ్చారని అక్కడ ఉండే కొంతమంది గొర్రెల  కాపరులు ఇండియన్ మిలిటరీ కి సమాచారం అందిచారు. ఈ ఆపరేషన్ కు పాకిస్తాన్ పెట్టుకున్న పేరు బద్ర్. దీని లక్ష్యం కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం.  మరియు ఇండియా తో డైరెక్ట్ గా యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్ కు ఎలాంటి ఉపయోగం లేకపోగా ఓటమిని ఎదుర్కోవాల్సివస్తుంది అని,  భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున  పెట్టడం, అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్  ఆలోచించి ఈ చొరబాటుకు ప్రయతించింది. కార్గిల్ మీదే దాడికి దిగడానికి ముఖ్యకారణం, చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్ధావరాలను స్వాధీన పర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతం పై పట్టు సాధించవచ్చని  పాకిస్తాన్ ఆలోచన. 
    పాకిస్తాన్ చొరబాటు దారులను మట్టుపెట్టడానికి మే 5 న భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది.  కానీ అందులో  అయిదుగురు బారత సైనికులను పాకిస్తాన్ చొరబాటు దారులు పట్టుకుని చిత్రహింస చేసి చంపేసారు.  కాశ్మీర్ లోని కార్గిల్  జిల్లాలో సుమారు  16 వేలనుంచి 18 వేల అడుగుల ఎత్తులో  పాకిస్తాన్  తమ సైనిక స్ధావరాలను ఏర్పాటుచేసుకున్నారు.  అంత ఎత్తులో ఉన్న ఆ పర్వతాలపై ఎంతమంది ఉన్నారో తెలియక ఇండియన్ ఎయిర్ ఫోర్సు కు చెందిన  మిగ్-21  ను అక్కడ పరిస్థితి చూసి రావాల్సిందిగా  పంపించారు. కాని పాకిస్తాన్ అంత ఎత్తులో ఉన్న advantage వల్ల  ఆ ఫైటర్ జెట్ ను కూల్చివేసారు . 
    ఇది ఇలాగె కొనసాగితే ఇండియా ఆర్ధికంగా నష్టపోవడంతో పాటు తమ సోల్డ్జర్స్  ను కూడా కోల్పోతామని  భావించి. ఇండియా అమెరికా సహాయాని కోరింది. మీ దగ్గర ఉన్న GPS ను ఉపయోగించి ఆ పర్వతాలపై ఎంతమంది చొరబాటు దారులు ఉన్నారు, వారి exact లొకేషన్ ఏంటో తెలియచేయాలి అని భారత్  అమెరికాను రిక్వెస్ట్ చేసింది. అప్పటికే పాకిస్తాన్ తో అమెరికా కు సత్సంబందాలు ఉండటం వల్ల  వారి నుంచి ఎలాంటి  సహాయం రాదు అని చెప్పేసింది.  
అయితేనేం మన భారత సైనికులు ఎక్కడ క్రున్గిపోకుండా GPS సహాయం లేకపోయినా పాకిస్తాన్ ముష్కరులను తరిమి తరిమి కొట్టారు.  నిజానికి అంత ఎత్తులో ఉండి యుద్ధం చేయడం పాకిస్తాన్ కు ప్లస్ అని చెప్పాలి అయిన సరే మన జవాన్లు వెనకడుగు వేయకుండా యుద్ధం లో విజయం సాదించారు.
    కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్న శత్రువులను తరిమి కొట్టాలి అనే ధృడ శకల్పంతో  విజయాని సాదించారు.  ఏ ముహూర్తాన  భారత్  దీనికి Operation Vijay అని పేరు పెట్టిందో కాని, కార్గిల్ ప్లేస్ లో మాత్రమే కాదు ప్రతి భారతీయుడి  మొహంలోను విజయాన్ని చూసారు. కాని వందల సంక్యలో  జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ అమెరికా కనుక GPS సహాయం అందించి ఉంటె అన్ని వందలమంది భారత జవాన్లు ప్రాణాలు  కోల్పోయి ఉండేవారు కాదు . భవిష్యతులో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు అని గుణపాటం నేర్చుకున్న ఇండియా ఒక కొత్త ప్రణాళికను సిద్హం చేసింది.  అదే IRNSS Indian Regional Navigation Satellite System,  పరాయి  దేశాల ముందు చేయిచాచి అవమానం తో వేణు తిరగాకూడదు అనే ఉదేశంతో మన సొంత satellite వ్యవస్థను మనమే  తయారు చేసుకునేవిదంగా అడుగు ముందుకు వేసింది.  ఇంతటి  ప్రతిస్టాత్మకమయిన ఈ ప్రాజెక్ట్ కు 2016 లో నరేంద్ర మోడీ నావిక్ అని  నామకరణం చేసి భారత ప్రజలకు అంకితం ఇచ్చారు.

     ఈ ప్రాజెక్ట్ ను ఇండియన్  government మే 2006 న అప్రూవ్ చేసింది.  IRNSS ఒక అటానమస్  regional satellite navigation system. దీనిని ISRO Indian Space Research Organization అభివ్రుది  చేసింది.  జూలై 1  2013 లో  IRNSS 1A తో మొదలు పెట్టి 2018 ఏప్రిల్ 12 వరకు  IRNSS 1I వరకు 9 satellites ను ఆర్బిట్ లోనికి పంపించగా అందులో రెండు FAILURES తో  మిగిలిన 7  ఉపగ్రహలు ఇండియన్ Tri Forces కు తమ సేవలను అందిస్తున్నాయి. IRNSS system 7 ఉపగ్రహాలను మరియు ఒక supporting గ్రౌండ్ సెగ్మెంట్ ను కలిగి ఉంటుంది.  వీటిలో 3 satellites geostationary orbit లోను మిగిలిన నాలుగు equatorial plane అనగా భూమధ్యరేఖకు 29 డిగ్రీస్ లో  geosynchronous ఆర్బిట్ లో  ఉన్ట్టాయి.  ఇలాంటి అమరిక కలిగిన ఈ 7 ఉపగ్రహాలు ఇండియన్ కంట్రోల్ స్టేషన్ తో  నిరంతరం   radio visibility కలిగి ఉన్ట్టాయి.
   Navic సిస్టం ఇండియా తో పాటు పాకిస్తాన్ చైనా మరియు హిందూ మహా సముద్రాలతో సహా  1,500 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు విస్తరించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ 2011 లోనే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కాని  టెక్నికల్ ప్రోబ్లెంస్ తో  సహా  కాంట్రాక్టర్, అడ్మినిస్ట్రేటివ్ , షిప్మెంట్ delay , సివిల్ వర్క్స్ వంటి  ఆటంకాలతో 2013 వరకు satellite లాంచ్ చేయడం  కుదరలేదు. అప్పటికే టెక్నాలజీ లో ముందు ఉన్న అమెరికా GPS పేరుతో, రష్యా Glonass,  చైనా బెయుడు, Europe Galilio, Japan QZSS  పేర్లతో సొంత నావిగేషనల్ సిస్టం ను కలిగి ఉన్నాయి. వీటిలో  అమెరికా మరియు  రష్యా మాత్రమే గ్లోబల్  రేంజ్  coverage ను అందిస్తూ   ఉన్నాయి .
      మన నావిక్  అమెరికా GPS కంటే ఎక్కువ accurate గా పని చేస్తుంది. అమెరికా GPS వరల్డ్ మొత్తం లో 31 satellites కలిగి ఉండగా మన నావిక్ 7 satellites

ను కలిగి ఉంది . నిజానికి ఇండియా తో సమానంగా అంతే accurate గా పనిచేయాలి అంటే అమెరికా మరొక 17 satellites ను ఆర్బిట్ లోకి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా 31 ఉపగ్రహాలతో ప్రపంచం మొత్తం కవర్ చేస్తున్ట్టే ఇండియా 7 ఉపగ్రహాలతో మన దేశాన్ని మాత్రమే  కవర్ చేస్తుంది. ఈ రేషియో లో చూస్తే  GPS కంటే నావిక్ satellites ఎక్కువ coverage  చేస్తున్నాయి అని అర్డంచేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉస్ చేసే అన్ని devices లోను అమెరికన్ GPS నే ఉస్ చేస్తున్నాం.  కాని మన సొంత నావిక్  టెక్నాలజీ ఉస్ చేసి, నావిగేషన్ మరింత accurate  గా ఉన్దేవిడంగా ప్రజలందరికి అందుబాటులో ఉండటం కోసం మరి కొన్ని సంవస్చారాలలోనే ఈ దేశీయ GPS ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
       రానున్న కాలంలో మన సొంత దేసేయ టెక్నాలజీ  తో మరిన్ని అద్బుతాలు  సృష్టించడానికి మన సైంటిస్ట్ లు కృషి చేస్తున్నారు.  వారి కళలు నిజం అవ్వాలని మన దేశం అగ్ర రాజ్యంగా ఎదగాలని కోరుకుంటూ... జై హింద్..

Indian Satellite
Best Indian Technology
Most Advanced Technolgy
NAVIC
navic gps
Navic Indian Own GPS
Telugu Videos
My Show My Talks
The Country's Own GPS Network In Telugu
 How India Built NavIC
What Is GPS & How It  Works 



What Is GPS & How It Works | How India Built NavIC | The Country's Own GPS Network In Telugu What Is GPS & How It  Works | How India Built NavIC | The Country's Own GPS Network In Telugu Reviewed by M. Prabhakara Reddy on July 23, 2020 Rating: 5

No comments

If you have any doubts please let me know.

Featured Post

Interlink Network Free Mining: Step‑by‑Step Guide to Earn ITLG Tokens (No Investment Needed)

Interlink Network Free Mining: Step-by-Step Guide to Earn ITLG Tokens Interlink Network Free Mining: Step-by-Step ...

Ads Home

Travel everywhere!